చిన్నారికి క్యాన్సర్: తల్లి ఆత్మహత్య
- October 10, 2017
బుర్ దుబాయ్‌లోని ఓ హోటల్ భవనంపైనుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి కీలక సమాచారం వెల్లడయ్యింది. ఇది హత్యా? అన్న అనుమానాలు తలెత్తగా, హత్య కాదు ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. తన కుమారుడికి క్యాన్సర్ సోకిందనీ, ఆ వ్యాధి కారణంగా చిన్నారి పడుతున్న వేదనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతురాలు ఆత్మహత్యకు ముందు లేఖ రాసి పెట్టి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుంటున్న తనను క్షమించాల్సిందిగా భర్తకు రాసిన మరో లేఖనీ పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి భర్తను పోలీసులు ప్రశ్నించగా, మానసిక సమస్యతో తన భార్య బాధపడుతోందనీ, అయితే ఆమె ప్రాణం తీసుకుంటుందని ఊహించలేకపోయానని చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







