షార్జాలో 120 హైబ్రిడ్‌ ట్యాక్సీలు

- October 10, 2017 , by Maagulf
షార్జాలో 120 హైబ్రిడ్‌ ట్యాక్సీలు

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) షార్జా, ట్యాక్సీ ఫ్లీట్‌ని హైబ్రిడ్‌ క్యాబ్స్‌గా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. పొల్యూషన్‌ని తగ్గించేందుకోసం ఈ హైబ్రిడ్‌ పద్ధతిలోకి సాధారణ ట్యాక్సీలను మార్చుతున్నారు. పెట్రోల్‌తో నడిచే 120 ట్యాక్సీలను హైబ్రిడ్‌ పద్ధతిలోకి మార్చుతున్నారు. 2015లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటికే 25 ట్యాక్సీల కన్వర్షన్‌, ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయ్యింది. ఈ ఏడాది చివరినాటికి 200 ట్యాక్సీలను హైబ్రిడ్‌ క్యాబ్స్‌గా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. హైబ్రిడ్‌ ట్యాక్సీలు పెట్రోల్‌తోపాటు, ఎలక్ట్రిసిటీతోనూ పనిచేస్తాయి. భద్రత పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటి కోసం. అత్యంత సురక్షితమైనవిగా అధికారులు వీటి గురించి చెబుతున్నారు. 30 శాతం పెట్రోల్‌ వాడకం తగ్గించడం, అలాగే 40 శాతం కార్బన్‌ ఎమిషన్స్‌ తగ్గించడమే లక్ష్యంగా ఈ హైబ్రిడ్‌ కార్స్‌పై ఫోకస్‌ పెట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com