ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ అమెరికాలోని
- October 12, 2017
చుట్టూ నీరు. మధ్యలో హోటల్. ఆ హోటల్‌లో స్టే చేయాలంటే రిస్క్ చేయాలి. ఎందుకంటే ఆ హోటల్‌కు చేరాలన్నా... అక్కడి నుంచి బయటకు వెళ్లాలన్నా బోట్ ఉండాల్సిందే. లేదంటే హెలికాప్టర్ ఎక్కాల్సిందే. ఈ హోటల్‌లో స్టే చేయడమంటే జీవితంలో మరచిపోలేని ఓ అడ్వంచర్ చేయడం లాంటిదే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ఇది. సముద్రం మధ్యలో ఉండే ఈ హోటల్ పేరు ఫ్రయింగ్ ప్యాన్. ఇది అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంది. ఈ హోటల్‌లో ఉండడమంటే సముద్రంలో ఉన్నట్లే. ఈ అనుభూతిని పొందడానికే చాలామంది ప్రాణాలకు తెగించి ఇందులో స్టే చేయడానికి వస్తారు. అంతేకాదు ఇది చాలా కాస్ట్‌లీ హోటల్ కూడా.
సముద్రంలో ఉండే అతి పెద్ద చేపలు, భయంకరమైన షార్క్‌లు ఇతర జలచరాలు హోటల్ చుట్టూ తిరుగుతుంటాయి. సముద్రపు అలలు హోరెత్తిస్తాయి. తుఫానులు వస్తే ఈ హోటల్ నుంచి బయటకు వెళ్లడంగానీ, బయటి నుంచి ఇక్కడికి రావడంకానీ సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్ ఇది. అయినాసరే కస్టమర్లు ఈ హోటల్‌లో స్టే చేయడానికి క్యూకడుతుంటారు.
నిజానికి ఇది ఒక లైట్ హౌజే. దీన్ని 1964లో నిర్మించారు. 15 ఏళ్ల క్రితం వరకు దీన్ని కోస్ట్ గార్డులు మాత్రమే ఉపయోగించేవారు. 80 ఫీట్ల ఎత్తున్న ఈ టవర్‌ను 5 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించారు. ఇందులో ఏడు బెడ్ రూంలు, కిచెన్, బాత్ రూం, స్టోర్ రూంతో పాటు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ హాల్ కూడా ఉంది. గేమ్స్‌తో రిలాక్స్ కావాలనుకునేవారి కోసం చిన్న గ్రౌండ్ కూడా ఉంది. ఈ లైట్ హౌజ్ వాడకం క్రమంగా తగ్గిపోయింది. దీంతో 2010లో అమెరికాలోని రిచర్డ్ నీల్ ఈ టవర్‌ను కొనుగోలు చేసి హోటల్‌గా మార్చాడు. ఇక్కడికి వచ్చే కస్టమర్లు సముద్రంలో చేపలుపట్టి ఎవరి భోజనం వారే వండుకుని తింటారు. ఎందుకంటే ఇక్కడ చెఫ్‌లు, వెయిటర్లు ఉండరు. అన్నింటికీ సిద్ధపడే కస్టమర్లు సముద్రం అందాలను ఆస్వాదించడానికి ఈ హోటల్‌కు వస్తారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







