భారత్ లో పాస్‌పోర్టు దరఖాస్తు మరింత సులభం
- October 12, 2017
చిన్నారులు, వృద్ధులకు 'వాక్‌ఇన్స్'
దివ్యాంగుల వేలిముద్రలు అక్కర్లేదు
నివాస ధ్రువీకరణగా 'అద్దె ఒప్పందం'
ఆర్‌పీవో ఉత్తర్వులు
పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరంకానుంది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి పాస్‌పోర్టు అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్ళలోపు చిన్నారులు, 60ఏళ్ళకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్లాట్ బుక్‌చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరంలేదు. తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్‌ఇన్ ఇంటర్వూలకు వెళ్ళిపోవచ్చు.
వికలాంగులు (చేతులు పనిచేయని లేదా కోల్పోయినవారు)ఐదేళ్ళ లోపు చిన్నారులకు 'వేలిముద్ర'లను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద...సంబంధిత రెంటల్ అగ్రిమెంట్‌ను అందించవచ్చు. తెలంగాణలోని అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాలు, సేవా కేంద్రాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఇ. విష్ణువర్ధన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







