కాబోయే అల్లుడిని చిన్న కోర్కె కోరిన మావగారు..వళ్ళు మండి పెళ్ళి రద్దు
- October 13, 2017
రియాద్: సౌదీ రాజు సాల్మాన్ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రపంచమంతా ప్రశంసల జల్లు కురిపించారు. స్రీలు సైతం ఇకపై తమ దేశంలో డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇస్తున్నామని ఆయన హుందాగా ప్రకటించారు. కానీ, వాస్తవం ఆ నిర్ణయ ఫలితాలు ప్రతికూలకంగా ప్రబలుతున్నాయి అనడానికి ఈ వార్త ఒక చక్కని ఉదాహరణ.. " అల్లుడు గారూ.. పెళ్లైన తర్వాత మా అమ్మాయికి కారు డ్రైవింగ్ చేసేందుకు మీరు అనుమతి ఇస్తారుగా అని ఓ మావగారు కాబోయే అల్లుడిని మురిపెంగా కోరాడు. అంతే వళ్ళు మండిన ఆ సనాతన వరుడు అంత స్వేచ్ఛ కోరుకొనే పెళ్లి కూతురు నాకు అవసరం లేదని ఒక్క ఉదుటున అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ముందే తెల్సింది...తర్వాత కారు నడిపితే మా పరువు పోయేది కాదూ అని పెళ్ళికొడుకు బంధువులు సైతం చెవులు కొరుక్కొన్నారు. కేవలం ఈ కారణంతో ఆ పెళ్లి ఆగిపోయింది. . తన జీవిత భాగస్వామి కారు నడపడానికి ఏమాత్రం అనుమతి ఇవ్వనని చెప్పాడు. ఎవరు చెప్పినా వినలేదు. పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సౌదీకి చెందిన యువకుడు. ఈ ఘటన సౌదీఅరేబియాలో జరిగింది. మహిళలు డ్రైవింగ్ చేయవచ్చంటూ సౌదీ రాజు సాల్మాన్ గర్వంగా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన వెలుగులోకి రావడం శోచనీయం. సౌదీలోని మహిళలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, బయటకు వెళ్లాలన్నా వారి సంరక్షల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే చట్టం అమల్లో ఉంది. దీంతో తన భార్య కారు డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వనని వరుడు చెప్పడంతో పీటల వరకు వచ్చిన ఈ పెళ్లి మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది.2018 జూన్ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ ప్రటకనతో సౌదీ మహిళలు సంబరాల్లో మునిగారు. అంతర్జాతీయంగా సౌదీకి ప్రశంసలు అందాయి. నిర్ణయంపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళ కారు డ్రైవింగ్ చేస్తానంటే ఒప్పుకోకపోవడమే కాకుండా పెళ్లి రద్దైన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని అరబిక్ డైలీ అల్-మార్షద్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







