ఫిలిప్పైన్స్ మహిళను గర్బిణీను చేసిన భారతీయడు ..దుర్భిణీ వేసినా జాడలేని వైనం
- October 18, 2017
దుబాయ్ : మనసారా ఓసారైనా మాట్లాడుకోలేదు... పేరైనా కనుక్కోలేదు..భారతదేశంలో తానూ ఉంటున్న ఊరైన కనుక్కోలేదు తనను తల్లిని చేశాడని ఫిలిప్పైన్స్ మహిళ గగ్గోలు పెడుతుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలిప్పైన్స్కు చెందిన ఓ మహిళ దుబాయ్ నగరంలో సెల్స్ఉమెన్గా పనిచేస్తోంది. కొన్ని నెలలక్రితం నగరంలోని జుమేరి బీచ్ ప్రాంతంలో ఓ వర్షం కురిసిన రాత్రి ఏమాత్రం పరిచయంలేని వ్యక్తితో శారీరికంగా కలిసింది. ఎటువంటి జాగ్రత్త లేకుండా సెక్సులో పాల్గొంది. ఆ విషయాన్ని అంతటితో మరచిపోయింది. కానీ ఏడు నెలల తర్వాత పొట్టపెరగడం, కడుపులో నొప్పి కూడా వస్తోందని హాస్పిటల్‌కు వెళ్తే ఆమె గర్భిణీ అని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో షాక్‌కు గురైంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ హాస్పిటల్లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా సెక్సులో పాల్గొవడం వల్ల గర్భం వచ్చిందని తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఒకే ఒక్కసారి తప్పు చేశానని, తన ఇష్టపూర్వకంగా చేశానని, కానీ గర్భం వస్తుందని ఊహించని లేదని బాధితురాలు కోర్టుకు తెలిపింది. గర్భదాల్చడానికి కారణమైన వ్యక్తి ఎవరని ప్రశ్నించగా.. వ్యక్తి పేరు, వివరాలు తెలియదని, అతడు భారతీయుడని మాత్రమే తనకు తెలుసునని చెప్పింది. చేసేదేమీలేక ఒక నెల జైలు శిక్షవిధించిన న్యాయమూర్తి, శిక్షాకాలం ముగిసిన అనంతరం నిందితురాలిని దేశం నుంచి వెళ్లగొట్టాలని తీర్పునిచ్చారు. ఫిలిప్పైన్స్ శకుంతల ...భారతీయ దుశ్యంతుడు ఇచ్చిన పుత్రికతో కనబడిన భారతీయులందరిని గుచ్చి గుచ్చి చూస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







