కోవా కోన్స్
- October 18, 2017
కావలసినవి: మైదా - 250 గ్రా, నెయ్యి - 100 గ్రా, పంచదార పొడి - 100 గ్రా, పాలు - 100గ్రా, నూనె - వేపుడుకు సరిపడా.
కోవా ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా - 250 గ్రా, పంచదార - 50 గ్రా, డ్రై ఫ్రూట్స్ తరుగు - 1 కప్పు (జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష).
తయారీ: మైదా, నెయ్యి, పంచదార పొడి, పాలు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని రోటీలా వత్తుకోవాలి. ఈ రోటీని సన్నని పట్టీలుగా కట్ చేసుకోవాలి. ఈ మైదా పట్టీలను మెటల్ కోన్ పైనుంచి కిందవరకూ చుట్టి అంచుల్ని పాలు తడిపి అతికించాలి. ఈ కోన్‌లను నూనెలో వేయించుకుని చల్లారాక వేరు చేయాలి. మరో బాండీలో కోవా వేసి చిన్న మంట మీద 10 ని.లు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరో గిన్నెలో వేయించిన ఖోయా, డ్రై ఫ్రూట్స్, పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న కోన్స్‌లో నింపి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







