మసూర్ పప్పు సూప్
- November 04, 2017_1509854248.jpg)
కావలసిన పదార్థాలు: మసూర్ పప్పు (ఎర్ర పప్పు) - అర కప్పు, క్యారెట్, టమోటా గుజ్జు - 1 టేబుల్ స్పూను చొప్పున, నూనె - ఒకటిన్నర స్పూను, ఉల్లిపాయ తరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, జీరాపొడి - అర టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, వెజిటెబుల్ స్టాక్ - 2 కప్పులు, నీరు - 1 కప్పు, కొత్తిమీర తరుగు - గుప్పెడు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూను, రోస్టెడ్ బ్రెడ్ ముక్కలు తగినన్ని.
తయారుచేసే విధానం: మసూర్‌పప్పుని అరగంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. నూనెలో ఉల్లి, వెల్లుల్లి తరుగు నిమిషం పాటు వేగించి జీరా, మిరియాల పొడులు, ఉప్పు, వెజిటెబుల్ స్టాక్, నీరు, నానిన పప్పు, క్యారెట్ టమోటా గుజ్జు వేసి 30 నిమిషాలు ఉడికించాలి. పప్పు మెత్తబడి సూప్ చిక్కబడ్డాక దించి నిమ్మరసం కలిపి, కప్పులో వేసి కొత్తిమీరతో అలంకరించి తాగాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!