"గూఢచారి"గా అడివి శేష్

- November 04, 2017 , by Maagulf

"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం"గూఢచారి". అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్-పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంను శశికిరణ్ తిక్క అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ సరసన మిస్ ఇండియా అయిన మన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి అడివి శేష్ కథ సమకూర్చడం విశేషం. 
"గూఢచారి" సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో & కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనీట్ రిలీజ్ చేశారు. అడివి శేష్ ఈ చిత్రంలో 
"గూఢచారి" పాత్ర పోషిస్తున్నాడు, హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రం సరికొత్త స్టాండర్డ్స్ ను సెట్ చేయడం ఖాయం అని టాలీవుడ్ టాక్. 2018 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com