గల్ఫ్ కార్మికుల సౌకర్యార్ధం , భారత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పధకాలు!
- November 08, 2015
గల్ఫ్ కార్మికుల సౌకర్యార్ధం , భారత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పధకాలు!
సౌకర్యాలు :
1. ఇండియన్ కమ్మ్యునిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF ) :
విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో ఇండియన్ కమ్మ్యునిటీ వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసారు. ఇంటి పని వారు, నైపుణ్యం లేని కార్మికులు ఆపదలో ఉన్నపుడు వారికి భోజనం మరియు వసతి సౌకర్యం కల్పించడం, అవసరమైన వారికి అత్యవసర వైద్య సహాయం, చిక్కుకుపోయిన వారికి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం, అర్హమైన కేసులలో ప్రాధమిక న్యాయ సహాయం, చనిపోయిన సందర్భాలలో మృత దేహాన్ని రవాణా చేయడానికి ఈ ఫండ్ ను వినియోగిస్తున్నారు.
2. TOM CAMP - తెలంగాణా ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ :
గల్ఫ్ వెళ్లేవారికి శిక్షణను ఇవ్వడానికి, ఉపాధి అవకాసాలను చూపించేందుకు కార్మికశాఖ అధ్వర్యంలో తెలంగాణా ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీని ఏర్పాటు చేసారు.
3. ఓవర్సీస్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ (OWRC) (విదేశాలకు వలస వెళ్ళే వారికి సహాయ కేంద్రం) : విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు మరియు భారతదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించదానికై OWRC వారు ఒక చార్జీ లేని నంబరు (టోల్ ఫ్రీ నంబర్) ద్వారా హెల్ప్ లైన్ నంబరును నిర్వహిస్తున్నారు. ఈ హెల్ప్ లైన్ వారానికి ఏడురోజుల పాటు, రోజుకు 24 గంటలపాటు పని చేస్తుంది. ఈ సమాచారం 11 భారతీయ భాషలలో ఉంటుంది. వాళ్ళకు అందిన ఫిర్యాదులు, ఇబ్బందుల తక్షణ పరిష్కారానికై వారు శ్రద్ధ వహిస్తారు మరియు ఫిర్యాదు దారులకు వాటి ప్రస్తుత స్థితిని వివరిస్తారు.
న్యూ ఢిల్లీ హెల్ప్ లైన్ నంబర్ 1800113090; హాట్ లైన్ నంబర్ 911140503030
4. తెలంగాణా ఎన్నారై సెల్:
విదేశాలలో ఎవరైనా అనుకోని పరిస్థితులలో చిక్కుకున్నా, జైలు పాలైనా ... ఒక వేళ చనిపోతే వారి మృత దేహాలను స్వదేశానికి రాప్పించాలన్నా తెలంగాణా ఎన్నారై సఖ సహకరిస్తుంది. సచివాలయంలోని ముఖ్య మంత్రి కార్యాలయంలో సాధారణ పరిపాలనా శాఖలో ఈ విభాగం ఉంటుంది. నేరుగా అధికారులను కలవవచ్చు. ఫోన్, ఫాక్స్, మెయిల్ ద్వారా నైనా సమాచారాన్ని అందించవచ్చు. టెలిఫోన్ అండ్ ఫాక్స్ నంబర్ 040-23220603
ఇ-మెయిల్ ఐ. డి.: [email protected]
పధకాలు :
1. ప్రవాస భారతీయ భీమా యోజన (PBBY):
ఈ పధకం ద్వారా రూ. 275 రెండేళ్లకు, రూ. 375 మూడేళ్ళకు ప్రీమియం చెల్లించిన కార్మికులకు ప్రమాద భీమా రూ. 10 లక్షలు, వైద్య ఖర్చులు రూ. 75 వేలు, భారత దేశంలో తమ కుటుంబానికి వైద్య ఖర్చులు రూ. 50 వేలు, న్యాయ సహాయ ఖర్చులు రూ. 30 వేలు, మహిళా కార్మికులకు ప్రసూతి సహాయం రూ. 25 వేలు, విదేశాలలో ఉన్నపుడు ప్రమాదవశాత్తు చనిపోయినా, అంగ వికలుడైనా స్వదేశానికి పంపడానికి అయ్యే విమాన ప్రయాణ ఖర్చులు చెల్లించబడతాయి.
2. మహాత్మా గాంధీ ప్రవాసీ సురక్ష యోజన (MGPSY):
ఇది కార్మికుల సాంఘిక భద్రత పొదుపు పధకం. ఇందులో జీవిత భీమా, వాపసు వచ్చిన తరువాత పునరావాసం, వృద్ధాప్య పించన్ సౌకర్యం మరియు కార్మికులు చేసే పొదుపుకు ప్రవాసీ భారతీయ మంత్రిత్వ శాఖ కూడా కొంత ప్రోత్సాహక చందా జత చేస్తుంది.
3. స్వర్ణ ప్రవాసీ యోజన (SPY):
ఈ పధకాన్ని ప్రవాసీ కౌసల్ వికాస యోజనగా 2014 సంవత్సరంలో మార్చారు. ఈ పధకం జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పోరేషన్ (NSDE) ద్వారా అమలౌతోంది. దీనిని ప్రవాసీ భారతీయ మంత్రిత్వ శాఖ క్రింద ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా 24 లక్షల మందికి నైపుణ్యం, శిక్షణ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
దీని లక్ష్యాలు :
1. దేశంలో ప్రస్తుతం ఉన్న కార్మిక ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంపొందించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ప్రామాణికతను వృద్ధి చేయడం.
2. నగదు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతను నైపుణ్య శిక్షణ వైపు ఆకర్షించడం, ఉత్పత్తి, నిర్మాణం, ప్లంబింగ్ రంగాలలో అత్యధిక ప్రోత్సాహం అందించడం ఈ పధకం యొక్క ముఖ్య లక్ష్యాలు.
--గుయ్య సాయి కృష్ణ,
రిసెర్చ్ స్కాలర్,
ఉస్మానియా యూనివర్సిటీ,
హైదరాబాద్
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









