కొత్తగా 108 పోస్టుల ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం
- November 08, 2015
కొత్తగా 108 పోస్టుల ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. హైదరాబాద్ లో ఆదివారం రాత్రి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయంలో పని పూర్తిచేసే కాంట్రాక్టర్లకు 2శాతం ఇన్సెంటివ్ ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. పాత ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదలశాఖలో ప్రమోషన్లు, అదనపు పోస్టులు ఇచ్చారు. సాగునీటిశాఖలో 8 మంది సీఈలు, ఏడుగురు ఎస్ ఈలు, 21 మంది ఈఈలను నియమించనున్నట్లు తెలిపారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను 2017 కల్లా తొలిదశ పూర్తికావాలని సూచించారు. ఏక కాలంలో కాళేశ్వరం బ్యారేజ్, తుమ్మిడిగట్టి, దేవాదులకు నీరందించేలా కొత్తూరు వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెలాఖరు నుంచే పనులు ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రైతులు రెండో పంట పండించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. నీటిపారుదలశాఖకు రూ.25 వేల కోట్ల కేటాయిస్తున్నట్లు తెలిపారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







