రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణి

- November 04, 2017 , by Maagulf
రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణి

కల్లోలిత యెమన్‌ నుంచి దేశ రాజధాని రియాద్‌పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్‌(షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణులు).. తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.

రియాద్‌పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మిస్సైల్‌ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200  కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు చెప్పారు. ఈ ఏడాది జులైలో కూడా యెమెన్‌ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com