హాలోవెన్ డే రోజున రిలీజైన దెయ్యం సినిమా నెక్స్ట్ నువ్వే ...
- November 05, 2017
కంటెంట్ కు సిచ్యువేషన్స్ కూడా కరెక్ట్ గా సింక్ అయితే సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. హర్రర్ కామిక్ గా తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమాకు కూడా ఇలాగే హాలోవెన్ డే ప్లస్ అయ్యింది. దెయ్యాల కథకు, దెయ్యాల ఫెస్టివల్ తో ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోది నెక్ట్స్ నువ్వే.
నెక్ట్స్ నువ్వే సినిమాకు ఓవర్సీస్ లో హాలోవెన్ డే మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెడుతోంది. ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్, వైభవి, రష్మి, లీడ్ రోల్స్ లో రూపొందిన ఈసినిమా హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వి4 బ్యానర్ లో పాజిటివ్ బజ్ తో వచ్చిన నెక్ట్స్ నువ్వే అదే బజ్ ను కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హాలోవెన్ డే సీజన్ నడుస్తోన్న యు.ఎస్ లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈమంథ్ స్టార్టింగ్ లోనే హాలోవెన్ డే రావడం, అదే టైంలో సినిమా కూడా రిలీజ్ కావడంతో నెక్ట్స్ నువ్వేకు ఈ సీజన్ ప్లస్ అయ్యింది. దీంతో సినిమాకు ఫ్లోటింగ్ పెరుగుతోందట. కలెక్షన్లు బావున్నాయట. సో నెక్ట్స్ నువ్వేతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాకర్ కు ఈసినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తోందని చెప్పొచ్చు. లోకల్ మార్కెట్ లో కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో టీం సెలబ్రేషన్ మూడ్ లో ఉంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







