నటి అంకిత ఇంట త్వరలో బాజాభజంత్రీలు
- November 08, 2015
నటి అంకిత ఇంట త్వరలో బాజాభజంత్రీలు మోగనున్నాయి. ప్రేమించిన వాడిని కొంగును ముడి వేసుకోనుంది. అంకిత వివాహ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఈ అంకిత ఎవరో గుర్తుందా? రస్నాబేబీగా పాపులర్ అయ్యి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించిన నటే అంకిత. అలా ప్రకటనల రంగం నుంచి చిత్ర రంగప్రవేశం చేసి హీరోయిన్‌గా ఎదిగిన అంకిత తమిళం, తెలుగు భాషలలో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో లండన్, థకధిమితా, తిరుమురుగా, అంబుగురి తదితర చిత్రాలలో కథానాయకిగా నటించిన అంకిత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి, బాలక్రిష్ణ సరసన విజయేంద్రవర్మ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. లాహిరి లాహిరి లాహిరిలో, అందురూ దొంగలే దొరికితే వంటి చిత్రాలలో నటించిన అంకిత కొంత కాలం క్రితం నటనకు దూరం అయ్యి న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకితకు ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. అంకిత, విశాల్‌ల వివాహ నిశ్చితార్ధం శనివారం ముంబాయిలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. వివాహం త్వరలో జరగనుందని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







