సునీల్ 'కృష్ణాష్టమి' తో సంక్రాంతి
- November 09, 2015
ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు స్టార్ హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీలు పడుతుంటారు. అయితే ఈ సీజన్‌కు మాత్రం హీరో సునీల్ తన కొత్త సినిమా 'కృష్ణాష్టమి'తో అగ్ర హీరోలకు పోటీనిచ్చేందుకు రెడీ అయ్యాడు. 2016 సంక్రాంతి బరి నుంచి మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం', పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'లు తప్పుకున్నాయి. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్' సినిమాలు మాత్రమే ఈ సారి సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. తమిళ హీరో సూర్య '24', నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలు సంక్రాంతి విడుదల బరిలో తాజాగా చేరగా, సునీల్ తన 'కృష్ణాష్టమి'తో వీరితో పోటీ పడనున్నాడు. షూటింగ్ పార్ట్‌ని ఈ సినిమా ఇప్పటికే పూర్తి చేసుకోగా నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని, అందుకే పండగకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. సో, ఈ 5 సినిమాల్లో ఏవి బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంటాయో మరికొంత కాలం వేచి చూడాలి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







