అపాచి హెలికాఫ్టర్ లను హైదరాబాద్‌లో తయారు చేస్తారట
- November 09, 2015
అమెరికాకు చెందిన ప్రముఖ విమాన రంగ సంస్థ బోయింగ్ , భారతీయ సంస్థ టాటాతో కలిసి జాయింట్ వెంచర్ ను ప్రారంభించబోతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ, విమానయాన రంగంలో వాడే AH-64 రకానికి చెందిన అపాచి హెలికాఫ్టర్ లను తయారు చేయనున్నారు. అది కూడా హైదరాబాద్‌లో తయారు చేస్తారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. విమానయాన రంగంలో భవిష్యత్తులో టాటాతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోయింగ్ ప్రకటించింది. ఎయిర్ క్రాఫ్ట్ ల విభాగంలో కొత్త తరహాకు చెందిన అపాచీతో పాటు చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాఫ్టర్ లను బోయింగ్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ ఇటీవల నిర్ణయించింది. టాటాతో హెలికాఫ్టర్ ల తయారీ ఒప్పందం ద్వారా ఇండియాకు పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని బోయింగ్ ఇండియా చైర్మన్ ప్రత్యూష్ కుమార్ అన్నారు. టాటాతో చేపడుతున్న ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ ఒప్పందం పెద్ద వార్త అని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాఫ్టర్ లు హైదరాబాద్ లో తయారుకానున్నాయని ఆయన వెల్లడించారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







