హీరో రాజశేఖర్ ను పొగడతలతో ముంచెత్తిన సునీల్
- November 08, 2017
'గరుడ వేగ' సక్సెస్‌తో హీరో రాజశేఖర్ పేరు మారు మ్రోగి పోతోంది. ఈ చిత్రం రాజశేఖర్‌కి మంచి బూస్ట్‌నిచ్చింది. ఇండస్ట్రీలో నేనూ ఉన్నానంటూ మరోసారి రుజువు చేశారు. విమర్శకులనుంచి కూడా ప్రశంసలందుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో కెరీర్ గాడిలో పడిందనే చెప్పుకోవచ్చు. రోజుకో సక్సెస్ మీట్‌తో రాజశేఖర్‌లో ఉత్సాహం రెట్టింపవుతోంది. తాజాగా స్టార్ హోటల్‌లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో చిత్ర టీమ్ పాల్గొని సందడి చేసింది. ఈ ఈవెంట్‌లో హీరో కమ్ కమెడియన్ అయిన సునీల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ గరుడ వేగ విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు. రాజశేఖర్ అంటే తనకెంతో అభిమానమని, మంచి మనసున్న మనిషి అని చెబుతూ రియల్ లైఫ్‌లో నాకెంతో సహాయం చేశారు. ఒకసారి నాకూతురికి బాలేనప్పుడు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. అందుకే రాజశేఖర్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







