ఆల్కహాల్ ప్రోడక్ట్స్‌పై ట్యాక్స్‌లు వేయాలి
- November 07, 2017
మనామా: ఆల్కహాల్ ప్రోడక్ట్స్‌పై అధికంగా ట్యాక్సులు విధించాల్సి ఉందని బహ్రెయినీ ఎంపీ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండింతలు, మూడింతలుగా ఆల్కహాల్, ప్రోడక్ట్స్‌పై ఆ ట్యాక్స్ విధిస్తే మంచిదని ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి చెప్పారు. పొగాకు ఉత్పత్తులు, సాఫ్ట్ మరియు ఎనర్జీ డ్రింక్స్‌పై ట్యాక్స్‌ని పెంచడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ ప్రభుత్వానికి ఉన్నది నిజమే అయితే ఆల్కహాల్ ప్రోడక్ట్స్పైన కూడా రెట్టింపు, మూడింతల జరీమానా విధించాలని అన్నారాయన. అల్ మారిఫి వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్లమెంటులో కొంత గందరగోళం చోటు చేసుకుంది. జీసీసీ యూనిఫైడ్ ఎగ్రిమెంట్ - సెలక్టివ్ ట్యాక్సేషన్ అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌కి సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా మారిఫి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యానికి హానికారకమైన పొగాకు ఉత్పత్తులపై 100 శాంత ట్యాక్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ 50 శాతం, ఎనర్జీ డ్రింక్స్‌పై 100 శాతం ట్యాక్స్‌ని విధిస్తూ బిల్లుని రూపొందించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







