సౌదీలో ఆకట్టుకొంటున్న అడ్వెర్టైజమెంట్ .. గొణుగుకొంటున్న సాంప్రదాయవాదులు
- November 10, 2017
రియాధ్: ' దేవుడు వరమిచ్చినా... పూజారి అడ్డం పడినట్లు ' సౌదీలో కొందరు చాందసుల వైఖిరి తయారైంది. ఇకపై మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. మరో పక్క కొందరు మతాధికారులు మహిళలు డ్రైవింగ్ చేయడమేమిటని మండిపడుతున్నారు. ఏళ్ళ తరబడి ‘డ్రైవింగ్ హక్కు’ కోసం ఓపిగ్గా వేచి ఉన్న మహిళలకు సౌదీ ప్రభుత్వం అక్టోబర్ నెలలో శుభవార్త తెలిపింది. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై కొందరు సానుకూలంగా స్పందిస్తే .ఇదిలా ఉండగా సౌదీలో నెలకొన్న పరిణామాలకు అనుగుణంగా కొకాకోలా కంపెనీ ఓ వాణిజ్య ప్రకటనను విభిన్నంగా రూపొందించి సౌదీలో ఇటీవల సంచలనం కల్గిస్తుంది.. ఓ తండ్రి తన కుమార్తెకు కారు డ్రైవింగ్ నేర్పేందుకు ప్రయత్నించడాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆ అడ్వెర్టైజమెంట్ వీడియో రూపొందించింది. ఈ వాణిజ్య ప్రకటన కొంత విడ్డూరంగా మత సాంప్రదాయాలను కాలరాసేవిధంగా సౌదీ ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొందరు ఆ ఆలోచనను ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. మారిన తాజా పరిణామాలకు అనుగుణంగా అడ్వెర్టైజమెంట్ వీడియో రూపొందించడం కోకాకోలా ప్రత్యేకతగా మిగిలింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







