దీపావళి పండుగ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదంటే కొన్ని జాగ్రత్తలు..
- November 09, 2015
దీపావళి పండుగ అనగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. కొత్త దుస్తులు ధరించి.. పిండి వంటకాలు ఆరగిస్తూ.. టపాసులు కాల్చుతూ ఆనందంతో గడుపుతుంటారు. ఈ ఆనందం విషాదాన్ని మిగల్చకూడదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే! జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కాటన్ దుస్తులే ధరించాలి. కాటన్ దుస్తులు ధరించడం వల్ల ఒక వేళ నిప్పురవ్వలు పడితే మంటలు త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు ఉపయోగపడుతాయి. టపాసులకు దూరంగా పసి పిల్లలను ఉంచాలి. టపాసులు కాల్చేటప్పుడు పిల్లల వద్ద పెద్దలు కచ్చితంగా ఉండాలి. ఇంట్లో, వీధుల్లో టపాసులు కాల్చరాదు. ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలి. ఇంట్లోని సిలిండర్లు, గ్యాస్ స్టౌల వద్ద టపాసులు ఉంచరాదు. భారీగా శబ్దం వినిపించే టపాసులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దలు తమ చెవులలో దూది పెట్టుకోవాలి. దీని వల్ల కర్ణభేరికి ఎలాంటి హాని జరగదు. అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బందికి తక్షణమే సమాచారం అందించాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







