పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా`ఖాకి`
- November 12, 2017
ఖాకి చొక్కాకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. సామాన్యుడికి ఎలాంటి కష్టం వచ్చినా ఖాకి చొక్కా వేసుకున్న పోలీస్ వచ్చి కాపాడుతాడనే నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని మరోసారి తెర మీద నిజాయతీగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కార్తి. ఖాకి చిత్రంలో కార్తి నిజాయతీ గల పోలీస్ అధికారిగా కనిపించారు. తను వేసుకున్న యూనిఫార్మ్ కు న్యాయం చేయడానికి ఎంత దూరమైనా తెగించే పోలీస్‌గా ఆయన ఇందులో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందిస్తున్నారు. `చతురంగ వేట్టై` ఫేమ్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో పోలీసుల బాధ్యతలను గుర్తుచేస్తూ కార్తి చెప్పే డైలాగులు మెప్పించనున్నాయి. భర్త నిజాయతీతో విసిగిపోయిన పోలీస్ ఆఫీసర్ భార్యగా రకుల్ చెప్పే డైలాగులు కూడా అందరికీ నచ్చుతున్నాయి అని చిత్రయూనిట్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష