అన్ని పంచాయతీలకూ భారత్‌నెట్‌ రెండో దశ ప్రారంభం నేడు

- November 12, 2017 , by Maagulf
అన్ని పంచాయతీలకూ భారత్‌నెట్‌ రెండో దశ ప్రారంభం నేడు

అన్ని పంచాయతీలకూ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల కల్పనే లక్ష్యంకేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ వెల్లడిఅమలుపై ఏపీ, తెలంగాణలతో ఒప్పందాలుదిల్లీ: అన్ని పంచాయతీలకూ హై స్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ను కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్‌నెట్‌ ప్రాజెక్టు రెండో దశను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు రూ.34 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇది రెండో దశమాత్రమే కాకుండా తుది దశ అని కూడా తెలిపారు. 2019 మార్చి నాటికి దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాండ్‌ బ్యాండ్‌ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదనంగా 10 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను వేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌, వైఫై సేవలు అందించే టెలికాం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బాండ్‌విడ్త్‌ సౌకర్యం కలిగిస్తామని వివరించారు. టెలికాం కంపెనీలు సెకనుకు 2 మెగాబిట్ల వేగం ఉండేలా డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్టుతెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com