షీరా లడ్డు
- November 10, 2015
కావలసినవి : పాలు ఒక కప్పు కండెన్స్‌డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ నాలుగు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి ఒక టీ స్పూను, ఎండు ద్రాక్ష రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా కోసుకున్న ఆల్మండ్ పప్పులు ఒక టేబుల్ స్పూను. ఈ చివరి రెండూ మీకు ఇష్టమైతేనే.
తయారుచేసే పద్ధతి
మూకుట్లో నెయ్యి వేసి వేడెక్కాక రవ్వపోసి బంగారు రంగు వచ్చేంత వరకు వేగించండి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్‌డ్ మిల్క్ కలిపి దానిలో ఈ రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలపండి. నెయ్యి పైకి తేలేదాకా కలుపుతూ ఉండండి. వేగించిన ఎండుద్రాక్ష కూడా వేశాక దించి లడ్డుల్లా చేసుకోండి. ఇష్టముంటే ఆల్మండ్స్ లేదా జీడిపప్పుల్ని పైన అలంకరించుకోండి.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







