అర్థ సహస్త్రాబ్ది ముస్తాబవుతున్న హవానా
- November 17, 2017
హవానా : క్యూబా రాజధాని హవానా గురువారం 498వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా హవానా నగరం గతంలో కన్నా మరింత అందంగా ముస్తాబవనుందని నగర చరిత్రకారుడు డా||యూపెబియో లీల్ స్పెంగ్లర్ వ్యాఖ్యానించారు. అత్యంత ప్రాచీన నగరమైన హవానాలోని సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించ డానికి, ఈ నగరానికి గల చారిత్రక ప్రాధాన్యతను, ప్రభావాన్ని కొనసాగించేందుకు తమ కార్యాలయం కృషి చేస్తోందని, శాశ్వత స్థాయిలో పలు నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతోందని చెప్పారు. 1519లో హవానా నగరం నిర్మితమైంది. 1852 నాటి పోర్టికోను కూడా తిరిగి నిర్మిస్తున్నారు. హవానా ప్రాచీన నగరంలో ప్రఖ్యాతి చెందిన, తదనంతర కాలంలో దెబ్బతిన్న చాలా కట్టడాలను ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు. సెంట్రల్ హిస్టారిక్ జిల్లాలో కొత్త యూత్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో హవానా యువత సినీ నిర్మాణం, రేడియో ప్రసారాలు, నృత్యాలు నేర్చుకోవడం వంటి కార్య క్రమాలు చేపట్టవచ్చు. . ఇక్కడ వారి కోసం గ్రంథాల యాన్ని కూడా ఏర్పాటు చేశారు. వలస కాలంలో హవానా ఎలా వుండేదో తెలియచెప్పేలా సందర్శకుల కోసం ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు.
2019 నాటికి హవానా 500వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తాము తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







