ట్యాంక్‌బండ్ నుంచి లవ్ హైదరాబాద్ ఐకన్ తొలగింపు
- November 18, 2017
లవ్ హైదరాబాద్ సెల్ఫీ స్పాట్ ట్యాంక్‌బండ్ నుంచి మరో ప్లేస్‌కు మారింది. ట్రైప్ స్కల్ప్చర్‌ను ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాకు మార్చాలని అధికారులు నిర్ణయించారు. లవ్ హైదరాబాద్‌ను తొలగించిన హెచ్‌ఎండీఏ అధికారులు.. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. స్కల్ప్చర్ ఏర్పాటు చేసిన కళాకృతి సంస్థ.. లవ్ హైదరాబాద్‌కు రంగులు వేసి తిరిగి మూడ్రోజుల్లో అందజేయనుంది. ఈలోపు పీపుల్స్ ప్లాజాలో దిమ్మె నిర్మించనున్నారు. చుట్టూ మూడు మీటర్ల బేబి గ్రిల్స్ ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. సందర్శకులు తాకకుండా ఇది రక్షణగా ఉంటుందని చెప్పారు. లవ్ హైదరాబాద్ వల్ల ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్‌ఎండీఏ దృష్టికి తీసుకురావడంతో.. ట్యాంక్‌బండ్ నుంచి తరలించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష