మణికర్ణిక కాన్సెప్ట్ లుక్ అదిరిపోయింది
- November 19, 2017
టాలీవుడ్లో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు క్రిష్. క్రిష్ సినిమాలు ఎప్పుడూ విమర్శకుల మనసుల్ని గెలుచుకొన్నాయి. ఇటివలే నందమూరి బాలకృష్ణ 100వ సినిమాని చిరస్మరణీయంగా మలచాడు. ఇపుడు బాలీవుడ్ లో భారీ సినిమాగా మణికర్ణిక తెరకేక్కిస్తున్నాడు. భారత దేశ చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని తీస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు క్రిష్. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించిన స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ నిర్మాత కమల్ జైన్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష