"జై సింహా" కొత్త షెడ్యూల్ ప్రారంభం
- November 19, 2017
బాలకృష్ణ, నయనతారల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన "శ్రీరామరాజ్యం, సింహా" చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే సక్సెస్ ట్రాక్ ను రిపీట్ చేయడానికి మరోసారి వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫిల్మ్ "జై సింహా". నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ నవంబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు హైద్రాబాద్ లో జరిగనుంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని దర్శక నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







