స్మృతి ఇరానీపై హీరో కామెంట్స్...ధీటుగా సమాధానం ఇచ్చిన స్మృతి
- November 21, 2017
కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్స్ చేయడం మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. గోవాలో సోమవారం 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇరానీ హాజరయ్యింది.
కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీది తెరకెక్కించిన 'బియాండ్ ది క్లౌడ్స్' సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా గురించి వ్యాఖ్యాతగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 'అరె.. మజిద్ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయన కూడా ఇరానీనే' అని మాట్లాడాడు.
ఇందుకు ఇరానీ స్పందిస్తూ.. 'ఓ మంత్రిపై హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్ చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత సహనంతో వ్యవహరిస్తోందో. ధన్యవాదాలు రాజ్‌కుమార్. కనీసం నీ కామెంట్‌తోనైనా నీ కాలు విరగొట్టింది భాజపా కార్యకర్తలేనని ఎవ్వరూ మాపై నిందలు వేయకుండా ఉంటారు' అని దీటుగా సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష