ఎక్లయిర్స్
- November 21, 2017
పేస్ట్‌కి కావలసినవి: వెన్న 100గ్రా.,మైదా 100గ్రా., నీళ్లు పావులీటరు, పంచదార ఒక టేబుల్ స్పూన్, నాలుగు గుడ్లు.., బన్నుల్లో నింపడానికి, టాపింగ్‌కి..., 200గ్రా చాకొలెట్, 150 మి.లీ క్రీం.
తయారీ విధానం
నీళ్లల్లో వెన్న వేసి మరిగించి దించి దానిలో పంచదార, మైదా వేసి బాగా కలిసేలా గిలకొట్టండి. పిండి మృదువుగా మారిన తరువాత మళ్లీ పొయ్యి మీద పెట్టి పిండి పక్కల అంటుకోకుండా ఉన్నప్పుడు దించివేయండి. అందు లో గిలక్కొట్టిన గుడ్లు వేసి బాగా కలియతిప్పండి. దీనివలన పిండి చిక్కగా మెరుస్తూ స్పూన్ నుంచి జారిపోయేలా అవుతుంది. దీనిని (ఎక్లైర్స్) సన్నగా పొడవైన ఆకారంలో వచ్చేలా చేసుకుని బేకింగ్ గిన్నెలో వేసుకుని 25 నిమిషాల పాటు కుక్కర్‌లో కేక్‌ని బేక్ చేసినట్లుగా చేయండి.
ఫిల్లింగ్‌కి...
చాకొలెట్‌ని, క్రీంని కరిగించి రెండుభాగాలుగా విభజించండి. పదునైన చాకు ని తీసుకుని ఎక్లైర్స్‌కి రంధ్రం చేసి అందులో చాకొలెట్ మిశ్రమాన్ని నింపండి. పూర్తిగా నింపిన తరువాత ఎక్లైర్స్ అన్నింటినీ మిగిలిన చాకొలెట్ మిశ్రమం లో దొర్లిస్తే వాటి వెలుపల కూడా అంటుకొని చాకొలెట్ రుచి పిల్లలకి బాగా నచ్చుతుంది.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







