నవంబర్ 24న 'నెపోలియన్' సందడి
- November 22, 2017
ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్'. ఆనంద్ రవి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ తదితరులు కీలక పాత్రధారులు. భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మాత. ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుదవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సమావేశంలో..
ఆనంద్ రవి మాట్లాడుతూ -"ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో మా నెపోలియన్ చిత్రానికే మంచి క్రేజ్ ఉంటుంది. మంచి టీం కలిసి చేసిన కష్టమిది. చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్‌లో నిలబడింది. నీడపోయిందని రిపోర్ట్ ఇచ్చే కామన్ మ్యాన్ కథే ఈ చిత్రం. ఆడియెన్స్‌ను ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసే చిత్రం. నవంబర్ 24న విడులవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. గీతాఆర్ట్స్ బన్నీ వాసుగారు మాకు విడుదల సమయంలో సహకారం అందస్తున్నందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్" అన్నారు.
భోగేంద్ర గుప్త మాట్లాడుతూ - "కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్రమిది. కొత్త టీంతో బాగా కష్టపడ్డారు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. గీతాఆర్ట్స్‌వారు సినిమా రిలీజ్‌కు సపోర్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా యు.ఎస్., యు.కెలో కూడా విడుదలవుతుంది. సినిమాను ప్రేక్షకులు పెద్ద హిట్ చేయించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
కోమలి మాట్లాడుతూ -"సినిమాపై ఆసక్తితో డాక్టర్ ప్రాక్టీస్ కూడా మానేశాను. ఒకప్పుడు నాకు నచ్చిన సినిమాలే చూసేదాన్ని. కానీ నెపోలియన్ నా అభిప్రాయాన్ని మార్చేసింది. ప్రతి సినిమాకు పడే కష్టం అర్థమైంది. సినిమా డిఫరెంట్‌గా ఉండి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది" అన్నారు.
రవివర్మ మాట్లాడుతూ - "నాకెరీర్‌లో నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఎమోషనల్ ఫ్లో ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ మూవీ" అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సదాశివుని, సినిమాటోగ్రాఫర్ మార్గల్ డేవిడ్ తదితరులు పాల్గొని సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







