కొత్త కథతో మారుతి, వెంకటేష్ కాంబినేషన్
- November 13, 2015
ఈ మధ్య కాలంలో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలు చాలా తక్కవుగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే బాక్సాపీస్ వద్ద సైతం విక్టరీ వెంకటేష్ అంతగా అలరించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే త్వరలో వెంకటేష్ చేయబోతున్న సినిమా బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించటం ఖాయం అని అంటున్నారు. దీనికి సంబంధంచిన వివరాల్లోకి వెళితే, 'భలే భలే మగాడివోయ్' సినిమాతో దర్శకుడిగా మారుతికి వున్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వెంకటేశ్ హీరోగా మారుతి తెరకెక్కించనున్న సినిమా ఈ నెల 15న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచి కూడా మారుతికి మంచి క్రేజ్ ఏర్పడుతూ వస్తుంది. కేవలం యూత్ కి మాత్రమే కాకుండా, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టయ్యే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందువల్లనే మారుతి సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఇక త్వరలోనే మారుతి, వెంకటేశ్ హీరోగా ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ కి సంబంధించిన మూవీ సెట్స్ మీదకు వెళ్ళే ముందు కథకి సంబంధించిన విషయంలో కాంట్రవర్సీగా మారి, షూటింగ్ ని నిలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్త కథతో మారుతి, వెంకటేష్ కాంబినేషన్ మరోసారి పట్టాలెక్కనుంది. మారుతి రెడీ చేసుకున్న స్క్రీప్ట్ పక్కాగా ఉండటంతో, ఈ మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధిస్తుందనే నమ్మకం మారుతి టీంలో ఉందట. అంతే కాకుండా ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వీరిద్దరి కాంబినేషన్ పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నయనతారను సెలక్ట్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







