క్షిపణుల సామర్ధ్యం పెంచుతాం : ఇరాన్
- November 26, 2017
లండన్: యూరోపియన్ యూనియన్ బెదిరింపులకు లోను చేస్తే తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్ల వరకు పెంచుతామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జి)కి నేతృత్వం వహిస్తున్న బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ సలామి తెలిపినట్లు స్థానిక వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం గురించి చర్చలు జరిపేందుకు ఇరాన్‌కు ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. దీంతోపాటు 2015లో అణుసమస్యపై ప్రధాన దేశాలతో ఇరాన్ చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగే అంశాన్ని కూడా చర్చించే అవకాశముంది. తన క్షిపణి కార్యక్రమం రక్షణ కోసం చేస్తున్నదేనని, దానిపై చర్చించాల్సిన అవసరం లేదని ఇరాన్ పదేపదే తెలిపింది. తమ క్షిపణుల సామర్ధ్యాన్ని 2 వేల కిలోమీటర్లకు మించి పెంచకపోవడానికి సాంకేతిక లోపం కారణం కాదని, తాము ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నందువల్లే అలా చేయలేదని హొస్సేన్ సలామి తెలిపారని ఆ వార్త సంస్థ తెలిపింది. యూరప్ నుంచి ముప్పు ఉండదని ఇప్పటి వరకు తాము భావించామని, అందవల్ల క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచలేదని, యూరప్ ముప్పు తలపెట్టాలని భావిస్తే, క్షిపణుల సామర్ధ్యాన్ని పెంచుతామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







