ఉలువల పరాటాలు

ఉలువల పరాటాలు

కావలసిన పదార్థాలు
రాజ్మా - ఒక కప్పు, ఉలవలు - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌, గరం మసాల పొడి, మిరియాల పొడి - అర టీ స్పూను చొప్పున, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, గోధుమపిండి - ఒక కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
రాజ్మా, ఉలవలు 8 గంటలపాటు నానబెట్టి కుక్కర్లో ఉడికించాలి. చల్లబడ్డాక మిక్సీలో బరకగా రుబ్బుకుని పక్కనుంచాలి. కొద్ది నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. ఆమ్‌చూర్‌, గరం మసాల, కారం, ఉప్పు, మిరియాల పొడితో పాటు రుబ్బిన మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించేయాలి. ఇప్పుడు తడిపి ముద్ద చేసిన పిండిని కొంత కొంత తీసుకుని పరాటాలు ఒత్తి, మధ్యలో తగినంత ఉలవల మిశ్రమం పెట్టి దగ్గరగా మడవాలి. మళ్లీ నెమ్మదిగా పరాటాలు ఒత్తి పెనంపై రెండు వైపులా నూనెతో కాల్చుకోవాలి. బలవర్ధకమైన ఈ పరాటాలను రైతాతో వేడి వేడిగా తినండి.

Back to Top