హాలీవుడ్ సూపర్ హీరోలు అందరూ ఒకే సినిమాలో...
- November 30, 2017
సూపర్ హీరోల సినిమాల ట్రెండ్ మార్చిన ఘనత హాలీవుడ్ మూవీ అవెంజర్స్ కే దక్కుతుంది. వేరే గ్రహాల నుంచి అతి భయంకరమైన విలన్లు భూమి మీదకు దండెత్తి వచ్చినప్పుడు, మానవాళిని కాపాడటానికి కలిసికట్టుగా పోరాడే అవెంజర్స్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అవెంజర్స్ సిరీస్ స్టార్ట్ అయ్యే వరకు, ఒక సినిమా మొత్తం ఒక సూపర్ హీరో చుట్టూనే తిరిగేది. కానీ ఈ సినిమా నుంచి హాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరూ ఒకే సినిమాలో కనిపించి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు.
అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగే అవెంజర్స్ సిరీస్ లో ఇప్పటికి రెండు సినిమాలొచ్చాయి. తాజాగా మార్వెల్ స్టూడియో మూడో పార్ట్ అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ పార్ట్ లో పాత సూపర్ హీరోలతో పాటు కొత్త హీరోలు కూడా యాడ్ అయ్యారు. ముందు రెండు పార్టుల్లో ఆరుగురు హీరోలుంటే ఈసారి వాళ్ల సంఖ్య డజను దాటి ఇరవై వరకు చేరింది. అందరూ కలిసి ఒక్కసారిగా యుద్ధం చేస్తుంటే ప్రేక్షకుల కళ్లు చెదిరిపోతాయనే చెప్పొచ్చు.
అవెంజర్స్ థర్డ్ పార్ట్ ట్రైయిలర్ రీసెంట్ గానే రిలీజైంది. ట్రయిలర్ మొత్తం ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తూ పోయేసరికే భారీ లుక్ వచ్చేసింది. కెప్టెన్ అమెరికా - థోర్ - హల్క్ - ఐరన్ మేన్ పాత టీం కాగా.. కొత్తగా డాక్టర్ స్ట్రేంజ్ - బ్లాక్ పాంథర్ - యాంట్ మేన్ - స్పైడర్ మేన్ వచ్చి జాయినయ్యారు. ట్రయిలర్ చివర్లో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీ సిరీస్ లో టీం మొత్తం కనిపించి హాయ్ చెప్పడం విశేషం. మొత్తానికి అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్ సినిమాలో ఏ ఒక్క సూపర్ హీరో క్యారెక్టర్ నీ వదలకుండా ఇందులో వాడేసింది. అవెంజర్స్ అభిమానులకు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారిని మెప్పించేలానే సినిమా ఉంటుందని అర్ధమైపోతుంది. ఫస్ట్, సెకండ్ పార్టుల్లానే త్వరలోనే రిలీజ్ అయ్యే థర్డ్ పార్ట్ కూడా అదిరిపోయే రేంజ్ లో బాక్సాఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటున్నాయి హాలీవుడ్ వర్గాలు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







