నటుడు చంద్రమోహన్ కుమార్తె ఫలక్‌నుమాలో నృత్య ప్రదర్శన
- November 30, 2017
ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది తెలంగాణా ప్రభుత్వం. విందుకు ముందు అతిధులను సమ్మోహన పరిచే అద్భుత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. మనదేశ సంప్రదాయ నత్య సమ్మేళనాలనన్నింటినీ మేళవించి ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి నంబూద్రి కూచిపుడి నృత్యం చేసింది. ఇందుకు గాను పన్నెండు రోజుల క్రితమే కేంద్రప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని..సమయం తక్కువగా ఉండడంతో రోజూ గంటల పాటు సాధన చేశామన్నారు. అతిరథ మహారథుల సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించడం మరచి పోలేని అనుభూతిని మిగిల్చిందని ఓ ఇంటర్వ్యూలో మాధవి చెప్పుకొచ్చారు. అటు నృత్యం, ఇటు సంగీతంతో సాగిన ఈ ప్రదర్శన భిన్నంత్వంలో ఏకత్వాన్ని సూచించింది. ఇవాంకతో సహా ఆహుతులందర్నీ అలరించింది ఈ నృత్య ప్రదర్శన.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







