హెచ్-1బీ వీసా జారీలో నో చేంజ్ : అమెరికా
- December 02, 2017
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా విధానంపై సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు హెచ్-1బీ ఉద్యోగ వీసాల జారీల్లో కఠిన నిబంధనలు తీసుకొస్తామని ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే ప్రస్తుతం అలాంటి చర్యలేం చేపట్టట్లేదని తాజాగా అమెరికా మంత్రి ఒకరు చెప్పారు.
హెచ్-1బీ వీసా జారీ విధానం మార్పుల కోసం ప్రస్తుతం ఎలాంటి చట్టం తీసుకురావట్లేదని దక్షిణాసియాకు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీ థామస్ వాజ్దా అన్నారు. 'హెచ్-1బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం అమెరికాలో ఎలాంటి చట్టం తీసుకురాలేదు. ఈ వీసాల జారీపై సమీక్ష జరపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. అయితే దాని తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ విధానాన్ని మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకురావాలి.
ప్రస్తుతానికైతే గతంలో ఉన్నట్లుగానే వీసాలు జారీ చేస్తున్నారు' అని థామస్ అన్నారు. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశానికి హాజరైన థామస్.. విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఇచ్చే గ్రీన్ కార్డు జారీల్లోనూ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. లాటరీ విధానంలో కాకుండా ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







