పాక్ వర్సిటీలో తాలిబాన్ల దాడి, 13 మంది మృతి
- December 02, 2017
పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చి పోయారు. అయితే ఈసారి పాక్ భద్రతా బలగాలు సమర్థంగా ఆ దాడిని అడ్డుకోవటంతో పెద్ద సంఖ్యలో ప్రాణా లు బలికాలేదు. శుక్రవారం ఉదయం కొందరు ఉగ్రవాదులు బుర్ఖాలు ధరించి పెషావర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాల యంలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో 13మంది మృత్యు వాతపడ్డారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల్ని పాక్ సైన్యం మట్టుబెట్టిం ది. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి...చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలిం చారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరు గుతున్నాయి. ఉగ్రవాదులు రిక్షాలో క్యాంపస్‌లోకి ప్రవేశించి నట్టు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఓ బాంబు కూడా పేల్చినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతాదళాలు క్యాంపస్‌ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి.ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 400మంది విద్యార్థులు ఉండగా మిలాద్-ఉన్-నబి కావడంతో చాలామంది ఇండ్ల కు వెళ్లారు. దాడి జరిగిన సమయంలో విశ్వవిద్యాలయంలో 120 మంది విద్యార్థులు ఉన్నట్టు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 2014లో పెషావర్‌లోని ఓ సైనిక పాఠశాలలో ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఘటనలో 141 మంది విద్యార్థులు మృతి చెందారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







