రష్యన్ పార్లమెంట్ లోకి అమెరికన్ జర్నలిస్టులు బాన్
- December 02, 2017
రష్యా దేశ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర విమర్శలు తావునిస్తోంది. పార్లమెంట్‌లోకి అమెరికా జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఓ తీర్మానాన్ని రూపొందించింది. పార్లమెంట్ దిగువ సభ డ్యుమాలో కవరేజ్ ప్రసారాల కోసం అమెరికన్ జర్నలిస్టులకు ప్రవేశం లేదని సభ నియంత్రణ కమిటీ అధ్యక్షుడు ఓల్గా సవత్స్యనోవా తెలిపారు. ఇది పూర్తిగా స్వతంత్ర్య నిర్ణయమేనని.. దీనిపై అధికారుల ఒత్తిడి ఏం లేదని ఆమె తెలిపారు. వచ్చేవారం ఈ తీర్మానాన్ని సభ ఆమోదించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా, ఇది ముమ్మాటికీ మీడియా హక్కులను కాలరాయటమేనని అమెరికా వాదిస్తుండగా.. తమ దేశానికి చెందిన ఆర్టీ నెట్ వర్క్ ఛానెల్ ప్రతినిధులను అమెరికన్ కాంగ్రెస్‌లోకి అనుమతించకపోవటానికి ప్రతీకార చర్యగానే రష్యా తాజా తీర్మానం ప్రవేశపెట్టినట్లు భావించవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







