ప్రియాంకకు సారీ చెప్పిన ఫెమీనా
- December 02, 2017
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి ప్రముఖ మేగజైన్ ఫెమినా క్షమాపణలు తెలుపుతూ ప్రకటన జారీ చేసింది. ఇటీవల ప్రియాంక ఆ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పని విషయాలను చెప్పినట్లు ప్రచురించిన కారణంగా క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 9న 'అయామ్ ఆల్ అబౌట్ గర్ల్ లవ్' అనే పేరుతో ఫెమినా పత్రికలో ప్రచురితమైన ఇంటర్వ్యూలో ప్రియాంక తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి ప్రస్తావించింది.
అయితే అతని పేరు చెప్పలేదు. కానీ ఫెమినా మేగజైన్ మాత్రం ప్రియాంక అతన్ని `ఎంఎఫ్` అని పిలుస్తుందని ప్రియాంక చెప్పినట్లుగా రాశారు. దీంతో ప్రియాంకతో పాటు ఆమె అభిమానులు కూడా అసంతృప్తికి గురైనట్లు తెలిసి ఆమెకు క్షమాపణలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రియాంక వేసుకునే ఎయిర్‌పోర్ట్ జాకెట్ ముంబైలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌కి చెందనిదని గతంలో కూడా చెప్పింది. కానీ అతని పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే గత అక్టోబర్‌లో కూడా ఈ ప్రస్తావన వచ్చినపుడు కొంతమంది నెటిజన్లు ఆ జాకెట్. షారుక్ ఖాన్ ఇచ్చినదని పుకార్లు కూడా పుట్టించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







