సమంత యుటర్న్
- December 02, 2017
హైదరాబాద్: దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న బ్యూటీ సమంత. ఈ భామ ఇంత వరకు మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించలేదు. అయితే ఆమె తొలిసారి అలాంటి సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. కన్నడ మిస్టరీ యుటర్న్‌లో నటించేందుకు సమంత సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. మాతృకకు దర్శకత్వం వహించిన పవన్‌కుమార్ ఈ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నారట. ఈ వార్తలే నిజమైతే ఆయన టాలీవుడ్, కోలీవుడ్‌లో తీస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది.
సమంత యుటర్న్ ప్రివ్యూ కట్ చూడటానికి తన భర్త నాగచైతన్యతో కలిసి ఇటీవల బెంగళూరు వెళ్లారట. అప్పుడే దర్శకుడితో రీమేక్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారట. మాతృకలో శ్రద్ధా శ్రీనాథ్, రోగర్ నారాయణ్, దిలీప్ రాజ్, రాధికా చేతన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2016లో ఈ సినిమా విడుదలైంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







