నాకు ఆ అనుభవం లేదు: షాలినీ పాండే
- December 02, 2017
తన మొదటి సినిమా 'అర్జున్‌రెడ్డి' తో యువత మనసు దోచుకుంది షాలినీ పాండే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే ఆట పాటకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తన అందచందాలు,నటనతో మెస్మరైజ్ చేస్తూ.. పద్దతిగా, సైలెంట్‌గా ఉంటూనే బోల్డ్‌నెస్‌ని చూపించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె తమిళంలో '100%లవ్' చిత్రం రీమేక్ '100%కాదల్' లో నటిస్తోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
తాను ఇప్పటివరకూ ఎవరినీ ప్రేమించలేదని, అలాంటి అనుభవం తనకు ఇంతవరకు కలుగలేదని చెప్పింది. 'అర్జున్ రెడ్డి' సినిమాలో ప్రీతీ క్యారెక్టర్‌లో భాగంగానే విజయ్‌తో లిప్‌కిస్ సీన్స్‌లో పాల్గొన్నానని తెలిపింది. నవ్వడం, ఏడవడం లాగానే ముద్దు పెట్టుకోవడం కూడా యాక్టింగ్‌లో ఓ భాగమే అని దానికి ఇబ్బంది పడటం ఎందుకు అని ప్రశ్నించింది. కెరీర్ పరంగా మరింత ముందుకెళ్లేందుకు నేను చేయగలుగుతాననుకున్న పాత్రలన్నీ చేస్తానని, స్టోరీ కోసం అవసరమైతే బికినీ వేయడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది షాలినీ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







