ఖాళీగా ఉండద్దు..ఏదో ఒక ఉద్యోగం చేయండి: మంత్రి లోకేష్
- December 02, 2017
2019 నాటికి ఇన్‌ఫర్మెషన్ టెక్నాలజీలో లక్ష, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ శనివారం అన్నారు. చదువుకున్న ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండకూడదని, మొదట్లో ఏ ఉద్యోగం దొరికినా అందులో చేరిపోవాలని సూచించారు. ఏపీ ఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళా ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఐటీ సలహాదారు జేఏచౌదరి మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 1087 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు తెలిపారు. మొదట యూనిటి 3డీ సంస్థ ప్రతినిధులతో ఐటీ శాఖ మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చిన సంస్థల ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, కొలువు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







