ముఖేష్ అంబానీ మాటలకు నెట్టింట్లో కామెంట్లు
- December 03, 2017
అవును.. సోషల్ మీడియాలో ఇవాళ ఇదే ట్రెండింగ్ టాపిక్. అసలు మిమ్మల్ని డబ్బడిగేదెవరంటూ ఒకటే కామెంట్లు. ఇంతకీ ఈ వ్యాఖ్యలన్నీ ఎవరిగురించి, ఏ పోస్ట్ గురించి అంటే. ఇంకెవరు.. ఒన్ అండ్ ఓన్లీ ఇండియాస్ రిచ్చెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ. ఇవాళ ముఖేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తన వద్ద క్రెడిట్ కార్డు కూడా లేదని, తనకు డబ్బు ముఖ్యం కాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొనడమే దీనికి కారణం.
ముంబయిలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్ పిష్ సదస్సులో ఫస్ట్ టైం వ్యక్తిగత విషయాలను ఆయన ప్రస్తావించారు. తాను డబ్బు గురించి ఆలోచించే వ్యక్తిని కాదని.. డబ్బుకన్నా తనకు వనరులే ఇంపార్టెంట్ అన్నారు. తను ఎక్కడికైనా వెళ్లినప్పుడు మరోకరు డబ్బులు చెల్లిస్తారన్నారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుందన్నారు.
ముఖేష్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి. ఏవస్తువైనా మీరు కొనాల్సిన అవసరం ఏముంది? ఒక వేళ కొంటే గింటే, మిమ్మల్ని డబ్బులడిగేదెవరని అంటున్నారు. అడుగుబయటకి పెడితే మందీమార్బలం మీవెంట ఉంటే..మీకు క్రెడిట్ కార్డులెందుకని ఇంకొందరంటున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







