రజనీకాంత్, చిరంజీవి కలిస్తే.. సప్తగిరి
- December 02, 2017
బ్రిలయంట్ డైరెక్టర్ సుకుమార్ సప్తగిరి హీరోగా నటించిన 'సప్తగిరి ఎల్.ఎల్.బి'లోని నాలుగో పాటని రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ''సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి తెల్సు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మంచి హిట్ అయ్యింది. మళ్లీ 'సప్తగిరి ఎల్.ఎల్.బి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ఎవరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేసి వుంటాడు అనుకున్నా. కానీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బుల్గానిన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ చేశాడు. సప్తగిరి డ్యాన్స్‌లు, ఫైట్స్ చూసి షాక్ అయ్యా. రజనీకాంత్, చిరంజీవిగారు మిక్స్ అయితే ఎలా వుంటుందో సప్తగిరి అలా కన్పించాడు. తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతని జర్నీ చాలా చాలా బాగుంది. రామజోగయ్య శాస్త్రి మంచి లిరిక్స్ రాశారు. డైరెక్టర్ చరణ్ ఎప్పట్నుంచో తెల్సు. అప్పుడప్పుడు కలుస్తుంటాం. చాలా టాలెంట్ వున్న డైరెక్టర్. నిర్మాత రవికిరణ్ మల్లెపువ్వులాంటి ప్రొడ్యూసర్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు'' అన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







