చారిత్రాత్మక చిత్రానికి కట్టి పట్టిన పోర్న్ బ్యూటీ
- December 03, 2017
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కి బంపర్ ఆఫర్ లభించింది. ఇప్పటివరకు తాను చేయని వెరైటీ రోల్ చేయబోతోంది. ఓ హిస్టారికల్ చిత్రంలో నటించనున్న సన్నీ.. మెల్లగా తన గ్లామరస్ డోస్ తగ్గించుకుని..తెలుగు అనుష్కలా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనుంది. తమిళ డైరెక్టర్ వీ.సీ.వడివుదయన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చారిత్రాత్మక చిత్రంకోసం ఆమె అప్పుడే కత్తిసాము, గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతోందని బాలీవుడ్ న్యూస్.
తెలుగు, తమిళం, హిందీ, మళయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం సన్నీ లియోన్ 150 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఈమెకు మరింత ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏపీ నుంచి ఓ స్పెషల్ ట్రైనర్ ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాని పోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నాడని, ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం స్క్రిప్ట్ తనకెంతో నచ్చిందని చెబుతున్న ఈ బ్యూటీకి వెరైటీ రోల్స్ లభించడం విశేషమే మరి !
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







