'గోల్డెన్ వీసా' గడవు మరో మూడు నెలలు పొడగింపు!
- December 05, 2017
వాషింగ్టన్: అమెరికాలో స్థిరపడాలనుకునే వారు ఈబీ-5 వీసా కోసం ప్రయత్నాలు జరుపుతుంటారు. దీనినే 'గోల్డెన్ వీసా' అని కూడా అంటారు.ఈ వీసాను పొందాలనుకుంటోన్న వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. దీనిపై సమగ్ర సమాచారం ఇచ్చారు కెనామ్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో జెఫ్ డెసికో. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఈబీ-5 వీసాను పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు వీసాల జారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని అన్నారు. వలస విధానానికి సంబంధించిన నిబంధనలను పునర్ వ్యవస్థీకరిస్తోందని, ఈబీ5 వీసా పథకంలోనూ మార్పులు ఉండవచ్చని తెలిపారు. ఈ వీసాను పొందడానికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టాల్సి ఉందని, పెట్టుబడి పెట్టే మొత్తాన్ని మరింత పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకోసం వీసా పొందాలనుకునే వారికి 30 నుంచి 60 రోజుల సమయం ఇస్తుందని తాము అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వీసాల జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, దీని ద్వారా ప్రతి ఏడాది 10 వేల మంది అమెరికన్లకు ఉపాధి దొరుకుతోందని వివరించారు. ఈ వీసా పొందే వెసులుబాటును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







