హెచ్1-బి వీసా నియంత్రణను వ్యతిరేకిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు
- January 05, 2018
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకురానున్న H1-b వీసా నియంత్రణ చర్యలను అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. H1-b వీసా పరిమితిని కుదిస్తుండటంతో నైపుణ్యం కల్గిన ఉద్యోగులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని, దాని వల్ల దేశంలో ప్రతిభావంతుల కొరత ఏర్పడుతుందంటున్నారు. వీసా పరిమితి కారణంగా వేలాది ఐటి కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని, దీని కారణంగా భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని డెమొక్రటిక్ నేత తులసీ గబ్బర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా దేశంలోని చిన్న, మధ్యతరగతి వాణిజ్య సంస్థలు దెబ్బతింటాయన్నారు. 21వ దశాబ్దంంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో పోటీపడగల సామర్ధ్యం కోల్పోతామన్నారు. H1-b వీసా ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని మరోనేత రాజా కృష్ణమూర్తి అన్నారు. మరోవైపు అమెరికాలోని ప్రముఖ న్యాయవాదులు, తెలుగు సంఘాల నాయకులు సైతం h1-b వీసా నిబంధనల విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







