పెరిగిన ఎక్సైజ్ పన్నుపోటుకు... తగ్గిన సిగరెట్ అమ్మకాలు !!
- January 05, 2018
మనామా:' సిగరెట్ కాల్చితేనే కాదు....పెరిగిన ఎక్సైజ్ పన్నుపోటుకి వాటిని కొనాలన్నా జేబుకు హానికరమే.' ఇటీవలి పన్ను పెంపుదలతో పొగబాబులు బహెరిన్ లో ఢీలా పడ్డారు. ప్రభుత్వ కఠినమైన ధూమపాన వ్యతిరేక కార్యక్రమాలు చాప కింద నీరులా నెమ్మదిగా చేరుకొంటున్నాయి. దీంతో ధూమపాన ప్రియులు తమ అలవాటు కొనసాగింపును తగ్గించి పొగ మానివేసి విధంగా నిరుత్సాహపరుస్తాయి. ఎక్సైజ్ పన్ను అమలు జరిగిన తరువాత సిగరెట్ అమ్మకాలలో నాటకీయ క్షీణత ఏర్పడిందని పలు దుకాణ నిర్వాహకులు వాపోతున్నారు.అయితే, సోడా వంటి కార్బొనేటెడ్ పానీయాల అమ్మకాలు సైతం వినియోగదారుడిని గిచ్చినంత పనిచేశాయని శీతల పానీయాల అమ్మకందారుల వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం గతం కంటే తక్కువ సిగరెట్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ దేశస్తుడు మొహమ్మద్ ఇస్లాం " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ సిగరెట్లపై పెరిగిన పన్నుతో తన బడ్జెట్లో ఇక కోత విధించ తప్పదని ..అలవాటుని వదులుకోకపోతే " తన మొత్తం ఆదాయాన్ని ధూమపానం చేయడానికే ఖర్చు చేయాల్సి ఉంటుందని నిరుత్సాహంగా చెప్పాడు. తాను ఒక దుకాణం వద్ద పెరిగిన సిగరెట్ల కొత్త ధర పట్టికను గమనించిన తర్వాత సిగరెట్లను కొనకుండా అక్కడనుంచి బలవంతంగా తిరిగివచ్చినట్లు తెలిపాడు. "ఒక తక్కువ వేతనంతో జీవనం గడుపుతున్నవేళ రెట్టింపు ధారగా పెరిగినసిగరెటీలను కొనుక్కొని విలాసంగా గడిపితే, ఆహారం తినడం లేదా ఇంటి అద్దెలు చెల్లించడం మానుకోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







