జెడ్డా పవర్ స్టేషన్ వద్ద మంటలు...పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
- January 29, 2018
జెడ్డా : ఉత్తర జెడ్డాలో విద్యుత్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద మంటలు ఎగిసిపడటంతో సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై మక్కా ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి సయీద్ అల్-సరాన్ మాట్లాడుతూ, అక్కడ జరిగిన అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాద స్థలానికి తరలించగా, విద్యుత్ పవర్ ట్రాన్స్మిషన్ స్టేషన్ లోని మంటలను నియంత్రించారన్నారు. తమ శాఖకు ఉదయం 7:36 సమయంలో అగ్ని ప్రమాదం గూర్చి సమాచారం అందిందన్నారు. విద్యుత్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం కారణంగా జెడ్డా నగరంలోని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, వీటిలో అల్-షాటీ, అల్-నహదాహ్, అల్-నయీమ్, ముహమ్మదియా, అల్-నూజా, అల్-మర్వా, అల్-హరమైన్ రహదారి, మరియు దక్షిణ ఓబ్హూర్.ఇది కూడా ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎలివేటర్లను నిలిచిపోయాయి . సివిల్ డిఫెన్స్ బృందాలు విపత్తు నివారణ జట్లు పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడకు వెంటనే తరలించారు. కాగా సివిల్ డిఫెన్స్ అధికారులు విద్యుత్ పవర్ ట్రాన్స్మిషన్ స్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరగడానికి దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ ప్రారంభించారు. విద్యుత్ సేవలలో కల్గిన అంతరాయంపై వినియోగదారులందరికి సౌదీ ఎలక్ట్రిసిటీ కో. క్షమాపణ చెప్పింది. సోమవారం ఉదయం విద్యుత్ నెట్వర్క్ లో ఏర్పడిన సాంకేతిక వైఫల్యం కారణంగా విద్యుత్ నిలిచిపోయింది. 20 నిమిషాల వ్యవధిలో విద్యుత్ ను పునరుద్ధరించబడింది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







