సివిక్ ఎంటర్ప్రెన్యూర్ 'దీపికా శర్మ'కు అరుదైన గౌరవం
- January 29, 2018
హైదరాబాద్:అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ద్వారా దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశాల్లో 'వాయిస్ ఆఫ్ ది యూత్' రిప్రెజెంటేషన్ కోసం టాలీవుడ్ నటుడు సతీమణి దీపికా ప్రసాద్(సివిక్ ఎంటర్ప్రెన్యూర్) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అర్బన్ గవర్నెన్స్ ఇనీషియేటివ్ - లకీర్ కో-ఫౌండర్‌గా దీపికా ప్రసాద్ బాధ్యతల్ని నిర్వహిస్తుండడం చాలా గొప్ప విషయం. దావోస్‌లో జనవరి 23 నుంచి 26 వరకు జరిగిన ఈవెంట్స్‌లో భారతదేశానికి చెందిన 150 మంది ప్రముఖులు, 3 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. పలు దేశాల అధినేతలు, ప్రపంచ ప్రక్యాత సంస్థలకు చెందిన అధిపతులు, సివిల్ సొసైటీ లీడర్స్ ఈ ఈవెంట్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఏ.పి మినిస్టర్ నారా లోకేష్ తదితరులు ఈ ఈవెంట్స్‌లో పాలుపంచుకున్నారు. ముఖేష్ అంబానీ, చందా కొచ్చర్, ఎరిక్ సచ్మిద్త్, షెరల్ సాండ్బర్గ్, సత్య నాదెళ్ళ వంటి ప్రముఖులు అదనపు ఆకర్షణగా నిలిచారు. హైద్రాబాద్‌లోని గ్లోబల్ షేపర్స్ కమ్యూనిటీకి క్యూరేటర్‌గా ఉన్న దీపికా శర్మ, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ - దావోస్‌లో యువతరం గళాన్ని వినిపించారు. 8 ఏళ్ళుగా ఆమె సౌత్ ఏసియా, ఈస్ట్ ఆఫ్రికాలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవం లభించింది.నగరాల వైపుగా తరలుతున్న గ్రామీణ భారతం, పట్టణాల్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు, అభివృద్ధి ఇతరత్రాల విషయాలపై దీపిక, వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రసంగించారు. జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు ఉన్న మార్గాల గురించీ ఆమె ప్రస్తావియించారు తన ప్రసంగంలో. వరల్డ్ బ్యాంక్, ఐఎఫ్సి, రాకెఫెల్లర్ ఫౌండేషన్, బోష్, యూనిలీవర్, గిజ్, షెల్ ఫౌండేషన్, ప్రదాన్ వంటి ప్రముఖ సంస్థలకు ఆమె సలహాదారుగా, సపోర్టర్‌గా పనిచేశారు. స్టార్టప్ వేవ్ పేరుతో అతి పెద్ద వర్చ్యువల్ ఇన్క్యుబేషన్ ప్లాట్‌ఫామ్‌ని కూడా దీపిక రూపొందించారు.




తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







